
ఎందుకంటే ఆపదలో ఉన్న పిల్లిని రక్షించేందుకు ఇక్కడ ఒక కోతి ఆరాటపడిన తీరు ప్రతి ఒక్కరిని ఫిదా చేసేస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇలాంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలోకి వస్తూ మనసును తట్టి లేపుతూ ఉంటాయి. ఇక ఇంకొన్ని వీడియోలను చూసిన తర్వాత మనసులో భావాలను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు అని చెప్పాలి. ఇక్కడ ఇలా మాటల్లో వర్ణించలేని ఒక భావన కలిగించే వీడియో వైరల్ గా మారిపోయింది. ఒక పిల్లి పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ తెలియకుండానే రింగులలతో
నిర్మించిన ఒక నీటి తొట్టిలో పడిపోయింది.
అదృష్టవశాత్తు ఆ నీటి తొట్టిలో నీళ్లు లేవు. కానీ అడుగుభాగం అంతా బురద పేరుకుపోయి ఉంది అని చెప్పాలి. దీంతో అందులో నుంచి ఎలా బయటికి రావాలో ఆ పిల్లి పిల్లకు అర్థం కాలేదు. దీంతో గట్టిగా అరుస్తూ ఎవరైనా సహాయం చేయండి అన్నట్లుగా దీనంగా చూస్తుంది. ఇక పిల్లి పిల్ల అరుపులు విన్న కోతి దానిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కోతి పిల్ల చిన్నది అయినా దాని మనసు మాత్రం పెద్దది. అందుకే నీటి తొట్టిలోకి దిగి.. తన తాహత్తుకు మించి చిన్న పిల్లిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ వీడియో నేటిజన్లను తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి.