బాబర్ అజాం ఏకంగా తన సన్నిహితులను స్నేహితులను మాత్రమే అటు జట్టులో చోటు కల్పించాలని ఎంతోమంది విమర్శలు చేశారు. ఆ దేశ మాజీ ఆటగాళ్లు సైతం బహిరంగంగానే ఇదే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఓ పాకిస్తాన్ ప్లేయర్ మాత్రం బాబర్ స్నేహం చివరికి కెరియర్ మొత్తం నాశనమయ్యేలా చేస్తుంది అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇలా సంచలన కామెంట్ చేసిన ప్లేయర్ ఎవరో కాదు మాజీ స్టార్ లెగ్ స్పిన్నర్ లలో ఒకరైన అబ్దుల్ ఖాదీర్ కుమారుడు ఉస్మాన్ ఖాదీర్ ఇప్పటివరకు పాకిస్తాన్ తరఫున 23 టీ20 మ్యాచ్ లు ఒక వన్డే మ్యాచ్ లు ఆడాడు.
ఒకరకంగా చెప్పాలంటే తన తండ్రి అబ్దుల్ ఖాదీర్ లాంటి లెగ్ స్పిన్నర్ ఉస్మాన్ ఖాదీర్ అని చెప్పాలి. అయితే 2022లో సెప్టెంబర్ లో కరాచీలో ఇంగ్లాండ్ తో జరిగిన టి20 ఫార్మాట్లో పాకిస్తాన్ తరఫున చివరికి అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై చాలా రోజులే అవుతుంది. ఎప్పుడెప్పుడు జట్టులో ఛాన్స్ దక్కుతుందా అని ఎదురు చూస్తున్నాడు. కాగా టి20లో 29 వికెట్లు పడగొట్టిన ఈ బౌలర్ వన్డేల్లో ఒక వికెట్ మాత్రమే దక్కింది. అయితే అండర్ 15 నుంచి ఉస్మాన్, బాబర్ అజాం కొనసాగుతుంది. అయినా జట్టులోకి తీసుకోలేదని.. అయితే బాబర్ స్నేహం మేలు కంటే కీడే చేస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఎందుకంటే బాబర్ స్నేహితులనే జట్టులో పెట్టుకున్నారు అని అంటున్నారు. అలా అయితే నేను జట్టులో నుండి బయటికి వచ్చేవాడినే కాదు. ఇలాంటి స్నేహం వల్ల ఇద్దరిపై ఒత్తిడి ఉంటుంది అంటూ ఉస్మాన్ ఖాదిర్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి