
అందుకే ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అతివృష్టి, అనావృష్టితో నాశనం చేస్తూ చివరికి రైతన్నకు కంటనిరే మిగులుస్తూ ఉంటుంది. అయితే ఎక్కువ మంది రైతుల పరిస్థితి ఇలా ఉంటే కొంతమంది మాత్రం.. వ్యవసాయ రంగంలో కూడా వినూత్నమైన పద్ధతులను అవలంబిస్తూ ధనవంతులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇలాంటి రైతు గురించి ఇండియా మొత్తం చర్చ జరుగుతుంది. బీహార్ కు చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా పశువులకు మేత తీసుకెళ్తున్నప్పుడు సైకిల్ మీద బైక్ మీద తీసుకెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా బీఎండబ్ల్యూ కారులో పశువులకు మేత తీసుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. పశువుల కోసం పచ్చ గడ్డిని కోసి ఆ గడ్డి మొత్తాన్ని కూడా bmw కారు మీద కట్టి ఇక అతను తీసుకు వెళుతున్నాడు. అయితే ఇది చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఎవరి కారో చోరీకి గురైనట్లుంది అని ఒకరు కామెంట్లు చేస్తుంటే.. అతను నిజంగానే ధనవంతుడు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా బీఎండబ్ల్యూ కారులో పశువును మేతలు తీసుకువెళ్లిన వ్యక్తి బీహార్ లోని సంస్థపూర్ లోని జిత్వాల్ పూర్ కు చెందిన అన్షు కుమార్. అతను వ్యవసాయం చేయడమే కాదు ఇక వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పశువుల పెంపకానికి కూడా ఉపయోగిస్తున్నాడు.