మన ఏ రకం వంటలు చేస్తున్న టమోటా పండు లేనిదే మనకి ముద్ద దిగదు.. అలాగే ఏ స్నాక్స్ తినే సమయంలో ఎక్కువగా టమోటా సాస్ లేనిదే అవి తిన్నట్టు కూడా ఉండదు కొందరికి. టమోటా తో ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. అలాగే టమోటా సాస్ ను కూడా చేసుకోవచ్చన్న విషయం మనకు తెలిసిందే.. అయితే ఆ టమోటా సాస్ ని ఎలా చేస్తారు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి.. అసలు విషయంలోకి వస్తే టమోటా సాస్ తయారీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది.. నేటిజన్స్ ''ఈ వీడియో చూశాక.. టమోటా సాస్ తీసుకోవాలంటే ఆలోచించాలేమో''అన్నట్టుగా తెలియజేస్తున్నారు.


అదేంటంటే టమోటా సాస్ తయారు అవుతున్న వీడియో విషయానికి వస్తే.. అందులో ఓ కంపెనీ వారు టమోటాలను ఒక పెద్ద తొట్టెలో వేసి శుభ్రం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. శుభ్రం చేయటం వరకు అయితే ఓకే కానీ అక్కడ ఉన్న టమోటాలని జూమ్ చేసి ఆ టమోటాలు ఎలా ఉన్నాయని తెలుస్తోంది. అవి కుళ్లిపోయి పురుగుబట్టిన టమోటాలుగా కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని మరీ దారుణంగా కుళ్లిపోవడంతో  పాటు పురుగు పట్టినట్టుగా చూసి అక్కడున్న కొందరు షాక్ అయ్యారు. వెంటనే ఈ ఘటనను కొందరు వీడియో తీసి వైరల్ గా చేస్తూ ఉన్నారు.ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''వామ్మో! ఇదేంటీ ఇంత దారుణంగా ఉంది''.. ప్రతిరోజు తినే టమోటా సాస్ ఇలా తయారు చేస్తారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చాలా ఫ్యాక్టరీల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందని మరికొందరు తెలియజేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇక జన్మలో కచ్చితంగా టమోటా సాస్ అయితే తినడానికి ఇష్టపడారని చెప్పవచ్చు.. ఈ వీడియో తెగ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: