జలపాతాలు చాలా వేగంగా ప్రవహిస్తాయి. వీటిలోకి దిగినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి వేగాన్ని అంచనా వేసి అందులోకి దిగాలి. లేకపోతే గల్లంతయ్యే అవకాశం ఉంది. తాజాగా ఒక వ్యక్తి చిన్న నీటి కుంటలో దూకి అదృశ్యమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రజలు ఏం జరిగిందో అర్థం కాక ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వింత వీడియోలు చూసి మనం చాలా సార్లు భయపడిపోతాం.
ఈ వీడియో చూసిన తర్వాత, ఎత్తైన ప్రదేశాల నుంచి నీటిలో దూకడం అనే ఆలోచనే చాలా మందికి భయంకరంగా అనిపిస్తుంది. అందరూ ప్రయాణాలు చేసి, కొత్త ప్రదేశాలను చూసి, ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుంటారు కదా, అలాంటి ప్రయాణాలలో చేసే సాహసాల్లో ఇదీ ఒకటి. కానీ ఈ వీడియోలోని సంఘటన చూసిన తర్వాత మాత్రం, అలాంటి సాహసాలు చేయాలనే ఆలోచనే మనసులో నుంచి తొలగిపోతుంది.
వీడియోలోని వ్యక్తి ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలో దూకాడు. కొద్ది సేపటి తర్వాత అతను తిరిగి నీటిపైన తేలకపోవడంతో చూస్తున్న ప్రతి ఒక్కరికి భయం వేసింది. ఆ నీరు బుడగలు వేస్తూ ఉండటంతో అతను ఎక్కడ ఉన్నాడో అని వెతుకుతూ చాలా ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అయింది. కానీ ఆ వ్యక్తి తిరిగి నీటిపైన వచ్చాడా లేదా అనే విషయం ఎక్కడా స్పష్టంగా చెప్పబడలేదు.
చాలా మంది ఈ వీడియో చూసి ఆ వ్యక్తికి ఏమైందో అని చాలా ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అతను సుడిగుండంలోకి వెళ్లిపోయి ఉంటాడని అనుకుంటున్నారు. ఆ నీటి కింద సొరంగాలు ఉంటాయి, అక్కడ నరే అతన్ని లాక్కొని వెళ్ళి ఉంటుందని మరి కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది మాత్రం అక్కడ నీటిలోని ప్రవాహాలు లేదా ఎక్కువగా గాలి కలిసిన నీరు ఉండటం వల్ల అతను కనిపించకుండా పోయి ఉంటాడని అనుకుంటున్నారు. ఇలాంటి నీటిలో ఈత కొట్టడం దాదాపుగా సాధ్యమని చెప్పుకోవచ్చు.
https://x.com/PicturesFoIder/status/1832726602150518785?t=Or5TNeZ07MVwp77lDqlgCw&s=19 లింకు పైన క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.