
దీంతో అక్కడి తోటి ప్యాసెంజర్స్ షాక్ అయయరు. అది వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు . అది కాస్త వైరల్ అయింది. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ధూమపానం, మద్యపాన పదార్థాలు తీసుకెళ్లటం లేదా వినియోగించడం రైలు నియమాల ప్రకారం నిషేధించబడింది. అంతేకాకుండా, ఇలాంటి చర్యల వల్ల సూక్ష్మంగా నిప్పు పడే ప్రమాదం కూడా పెరుగుతుంది — అది అనూహ్య విధంగా పెద్ద నష్టం కలిగించవచ్చు. ఆ సమయంలో ఇతర ప్రయాణికులు ఆ యువతిపై స్పందించి, ఆమెను నిలదీయడానికి ప్రయత్నించగా ఆమె ఆగ్రహంగా స్పందించి “నా వీడియో తీస్తున్నావా? మీ బాబుదా ట్రైన్..? నీకు సమస్య ఉంటే పోలీసులకు చెప్పుకోండి” అనే విధంగా, వీడియో తీస్తున్న వారితో వాదన చేయడం గమనించచ్చు. వీడియోలో ఆమె మాట్లాడిన పదప్రయోగాలు, అలాగే స్మోక్ చేసే విధానం చూస్తే మద్యపాన ద్వారా మత్తులో ఉండినట్టు కూడా అనిపించింది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, దారుణమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరూ “పబ్లిక్ స్థలంలో మహిళలు ఇలా ఎలా ప్రవర్తించగలరు?” అని మండిపడుతున్నారు. మరికొందరు వ్యక్తిగతంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. అంతేకాదు కొందరు ఆ లేడీ కి రైవ్ల్వే రూల్స్ గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ లేడీ చేసిన హంగామ కొంచెం సేపు అక్కడ ఆ ఏసీ కోచ్ లో ఉండే తోతి ప్యాసెంజర్స్ ని భయబ్రాంతులకు గురిచేసింది. అస్సలు ఎందుకు చదువుకున్న అమ్మాయిలు ఇలా చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది ఈ వీడియో ని వైరల్ చేస్తూ ఘాటు గా రెస్పాండ్ అవుతున్నారు..!