సోషల్ మీడియా మాయ మరోసారి రుజువైంది. వైరల్ అవ్వడానికి పెద్ద సెటప్, భారీ ప్రొడక్షన్ అవసరం లేదని, కేవలం రెండు సెకన్ల వీడియో కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగలదని మళ్లీ నిరూపితమైంది. సామాజిక మాధ్యమాల్లో ఏ వీడియో ఎప్పుడు, ఎలా, ఎందుకు వైరల్ అవుతుందో ఇప్పటికీ ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ఆ అనూహ్యమైన వైరల్ మ్యాజిక్‌కు ఇదే మరొక సజీవ ఉదాహరణ. ఒక యువతి ఆటోలో కూర్చొని సరదాగా తీసుకున్న రెండు సెకన్ల చిన్న క్లిప్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’ను షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా కోట్ల వ్యూస్‌తో ప్రస్తుతం ఈ వీడియో హాట్‌టాపిక్‌గా మారింది.


నవంబర్ 2వ తేదీన ‘BUD WISER (@wordgenerator)’ అనే యూజర్ makeup ate today అనే సింపుల్ క్యాప్షన్‌తో ఈ చిన్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. క్లిప్‌లో ఉన్న అమ్మాయి వైట్ టాప్, వెండి చెవిపోగులు, చాలా సింపుల్ లుక్‌తో ఆటోలో కూర్చుని ఉండటం మాత్రమే కనిపిస్తుంది. ఎలాంటి ప్రత్యేకత లేకుండా, చాలా సాధారణంగా తీసిన ఈ వీడియో క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో 102 మిలియన్ వ్యూస్ దాటింది. ఒకే ఒక్క 2 సెకన్ల వీడియోతో ఆ యువతి రాత్రికిరాత్రే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమెను “బండానా గర్ల్” అని పిలుస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే—ఈ ఒక్క ట్వీట్ ద్వారానే ఆమె లక్షల్లో సంపాదించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా అనలిస్టుల ప్రకారం, ఈ వైరల్ క్లిప్‌ వల్ల ఆమె రూ. 5 లక్షల వరకు సంపాదించి ఉండొచ్చని భావిస్తున్నారు.



సాధారణంగా కంటెంట్ క్రియేటర్లకు వైరల్ కావడం అంటే నెలలు, సంవత్సరాలపాటు కష్టపడాలి. కానీ ఈ యువతి మాత్రం ఏ ప్రత్యేక ప్రయత్నం లేకుండా, ఒక్క క్లిప్‌తో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. దీనిపై నెటిజన్లలో ఇంకా ఆసక్తి, ఆశ్చర్యం తగ్గడం లేదు. “ఈ వీడియోలో అసలు ప్రత్యేకత ఏముంది?”, “ఎందుకు ఇది ఇంత పెద్ద ఎత్తున వైరల్ అయింది?” అని అనేక కామెంట్లు వస్తూనే ఉన్నాయి. అదే సమయంలో, ఈ వీడియోను పోస్ట్ చేసిన @wordgenerator  అనే అకౌంట్‌కు కూడా భారీగా గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియా అనేది ఒక అవిప్రిడిక్టబుల్ ప్రపంచం. ఏ చిన్న విషయం అయినా, ఏ క్షణమైనా, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారవచ్చు అనే దానికి ఈ “ఆటోలో అమ్మాయి” వీడియో తాజా ఉదాహరణ.


https://www.instagram.com/p/DRO0mGAkeR5/

https://www.instagram.com/p/DRO0mGAkeR5/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==




మరింత సమాచారం తెలుసుకోండి: