అదృష్టం ఎవరి సొత్తూ కాదు! అది ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో చెప్పడానికి వీల్లేదు! కానీ, అదృష్టం తలుపు తడితే.. కటిక పేదరికం కూడా కొద్ది గంటల్లోనే కోట్లు కురిపిస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ మాస్ స్టోరీ! పంజాబ్‌లోని లూథియానాకు చెందిన మహేశ్వరి సాహ్ని అనే ఓ నిరుపేద మహిళ జీవితం.. ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది.మహేశ్వరి సాహ్నిది కడు నిరుపేద కుటుంబం. భర్త దూరమయ్యాడు. ఆ బాధ నుంచి కోలుకోకముందే, కన్న కొడుకు కూడా దూరం కావడంతో.. ఆమె జీవితం అగాధంలో పడింది. ఇళ్లలో పని చేసుకుంటూ, చిన్న కూతురిని పోషించుకుంటూ.. రెక్కాడితే గానీ డొక్కాడని దయనీయ పరిస్థితి ఆమెది. బతుకు భారంగా మారిన ఆ సమయంలో.. తన కూతురికి పుట్టినరోజుకు కనీసం ఓ బహుమతి కూడా కొనివ్వలేని స్థితి! ఆ కష్టాల కడలిలోనే, ఆమెకు ఓ పత్రికలో లాటరీ వార్త కనిపించింది. తన కూతురు పేరు మీద టికెట్ కొంటే అదృష్టం వరిస్తుందేమోనని ఆశపడింది.


ఆ ఒక్క నిర్ణయం.. మూడు కోట్ల విజయం!

"కూతురి కోసం ఏదైనా చేయాలి" అన్న కసితో, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో.. మహేశ్వరి ధైర్యం చేసింది. తన దగ్గర ఉన్న చిన్న చెవిపోగులు తాకట్టు పెట్టింది! అలా వచ్చిన ₹2000 రూపాయలతో ఏకంగా నాలుగు లాటరీ టికెట్లు కొనుగోలు చేసింది. జనవరి 17న కూతురి బర్త్‌డే రోజున తీసుకున్న ఆ టికెట్లు.. నవంబరు 22న ఆమె జీవితాన్నే మార్చేశాయి. ఆ రోజు సాయంత్రం.. ఆమె కొన్న టికెట్లకు రూ.3 కోట్లు బహుమతి తగిలిందని తెలిసి.. ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది!



డాక్టర్ కావాలన్న కూతురు కల.. నెరవేరుతుంది!

ఈ ఊహించని విజయాన్ని నమ్మడానికి మహేశ్వరికి కొంత సమయం పట్టింది. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.. ఆమె మాట్లాడుతూ.. "నేను నమ్మలేకపోయాను. జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ దేవుడికే తెలుసు. ఇప్పుడు ఈ డబ్బుతో.. నా కూతురిని బాగా చదివించి, ఆమె డాక్టర్ కావాలన్న కలను కచ్చితంగా నెరవేరుస్తా!" అని ఉద్వేగంగా చెప్పింది.ఆ ఒక్కరోజు రాత్రి.. కటిక పేదరికం నుంచి కోటీశ్వరురాలిగా మారిన మహేశ్వరి సాహ్ని కథ.. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆశాదీపం. నిజాయితీగా కష్టపడేవారికి, కన్నీళ్లు పెట్టుకున్న వారికి దైవం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని అందిస్తాడని ఈ కథ నిరూపించింది. లక్ష్యం ఉన్నచోట లక్ష్మి తప్పకుండా ఉంటుంది!



మరింత సమాచారం తెలుసుకోండి: