పివి సింధు... ఒక మహిళా కెరటం... భారత ఖ్యాతిని బ్యాట్మెంటన్ క్రీడలో  ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి ఎంతో గుర్తింపు సంపాదించిన గొప్ప క్రీడాకారిణి పి.వి.సింధు. భారతదేశానికి మొత్తం ఆశా కిరణం లా మారిన యువ సంచలనం పీవీ సింధు. బ్యాట్మెంటన్ క్రీడలో  ప్రపంచ స్థాయి పోటీల్లో సైతం సత్తాచాటిన తెలుగు తేజం పీవీ సింధు. 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్లో రజత పతకం సాధించి ఒలంపిక్స్ పోటీల్లో మొదటి సారి భారత్ తరఫున రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది పీవీ సింధు. ఇప్పటివరకూ ఎంతోమంది క్రీడాకారిణులు ఉన్నప్పటికీ ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించింది. అది కూడా ఒక తెలుగు మహిళ ఇంతటి ఘనత సాధించడం తెలుగు ప్రజలందరికీ ఎంతో గర్వకారణం. 

 

 

 ఒక్కసారి బరిలోకి దిగింది అంటే చిరుత పులిలా కోర్టులో కదులుతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తు ఉంటుంది తెలుగు తేజం పీవీ సింధు. తన వేగాన్ని అందుకోవడం చాలా కష్టమైన పని. సెప్టెంబర్ 21 2012న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన టాప్ 20 జాబితాలో చోటు దక్కించుని  మొదటిసారిగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్షిప్ లో  సింధు పతకం సాధించి.. అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా తెలుగుతేజం గా రికార్డు సృష్టించింది . ఇక 2015 లో పీవీ సింధు కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఇక 2016లో జపాన్కు చెందిన నోవోమి ని  ఓడించడం ద్వారా ఫైనల్ చేరింది పీవీ సింధు. ఒలంపిక్స్ లో  ఫైనల్ చేరిన మొట్టమొదటి భారత మహిళగా కూడా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఫైనల్స్ లో  రజత పతకం సాధించి... ఒలింపిక్స్ లో  పతకం సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా తెలుగు మహిళగా సంచలన రికార్డు నమోదు చేసింది.

 

 

 ఒలంపిక్స్ లో  బ్యాడ్మింటన్ లో  పథకాల కోసం తల్లడిల్లుతున్న భారత్ కు  ఆశాకిరణంగా మారిన పీవీ సింధు రెండో పథకాన్ని కూడా ఖాయం చేసింది. ఆ తర్వాత ఇంకెన్నో విజయాలు మరెన్నో అవార్డులు రివార్డులు. ప్రస్తుతం భారత్ మొత్తానికి ఆశాకిరణం పీవీ సింధు. ఒలింపిక్స్ లో  పతకం సాధించాలి అన్నా అది ఒక పి.వి.సింధు తోనే సాధ్యం అవుతుందని భారత ప్రజానీకం నమ్ముతూ ఉంటుంది.  ఇలా ఎన్నో విజయాలను భారత్ కి తెచ్చిపెట్టి ఎన్నో రికార్డులను సైతం సృష్టించింది పీవీ సింధు. అందుకే భారత యువ కెరటం ఆశాకిరణం  పీవీ సింధు ఈరోజు విజేతగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: