ఇక్కడ కప్పలు అంటే నిజంగా కప్పలు కాదు.. సమస్యలు. ముందు ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకుంటే.. ఆ అనుభవంతో రెండో చిన్న సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. ఎందుకు నువ్ అది సాధించలేకపోయావు అని ఎవరైనా అడిగితే సమస్యలన్నీ నాకే అన్నట్టు చెప్తారు అలా చెప్తే మనల్ని మనమే చులకన చేసుకున్నట్టే... సమస్యల్ని గుర్తించాలి తర్వాత పరిష్కరించే దారి వెతకాలి. అడుగు ముందుకేస్తేనే కదా దారిలో ఏముందో తెలుస్తుంది. ప్రతి వ్యక్తి కనీసం మూడు లక్ష్యాలను పెట్టుకోవటం మంచిదంటారు అనుభవజ్ఞులు. ఆ మూడూ కూడా మనకు అందుబాటులో ఉండేవి అయ్యుండాలి. ఉదాహరణకు నేను నెలకు కనీసం రెండు లక్షల రూపాయల ఆదాయం లభించే వ్యాపారం చేయాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, పరీక్ష పాసవ్వాలి, వివాహ జీవితం ప్రశాంతంగా ఉండాలి.
ఇలా మీరు సాధించాలనుకున్నవి ఒక పేపరుమీద సాధించినట్లుగా రాసుకోవాలి. వాటిని మూడు రోజులపాటు రోజూ ఉదయం లేచి చదువుకోవాలి. నాలుగో రోజు ఉదయం లేచి వాటికి సంబంధించిన ప్రోగ్రామ్‌లు తయారుచేసుకోవాలి. ప్రతిదానికి ప్రణాళిక ఉండాలి. మీ లక్ష్యానికి సంబంధించిన పని చేయడానికి ఏ పని, ఎప్పుడు ఎలా చేస్తే బాగుంటుందో ఒక ప్రణాళిక ముందుగా వేసుకోవాలి. ప్రణాళిక లేకపోతే ప్రభుత్వాలే కాదు జీవితాలూ కూలిపోతాయి. అందుకే సాధించాలి అనుకుంటే సరిపోదు ఎలా సాధించాలో ఒక ప్రణాళిక వేసుకోడం కూడా విజయానికి తొలిమెట్టే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి