బ్రాయిలర్ చికెన్ : రెండుకిలోలు సాల్ట్ : 25 గ్రాములు పెరుగు : 750 గ్రా.లు కారం :15 గ్రా.లు వెల్లుల్లి : 50 గ్రా.లు నెయ్యి : 200గ్రా.లు అల్లం : 50 గ్రా. లు  గుడ్లు : ఆరు నిమ్మికాయ : రెండు ఉల్లిపాయలు : 150 గ్రాములు పసుపు : కొంచెం ఫుడ్ కలర్ : కొద్దిగా పసుపు : కొంచెం కొత్తిమీర : ఒక కట్ట తయారుచేయువిధానం : చికెన్ను శుభ్రం చేసుకుని బొమికలు తీసేసి మాంసం మాంత్రం కావాలసిన సైజులో ముక్కలు కొసుకోండి. గరం మసాలా పొడి, అల్లం, వెల్లుల్లిముద్ద, నిమ్మరసం, కారం, ఉప్పు, చికెన్ ముక్కలలో వేసి కలుపుకోవాలి. పెరుగును బాగా కలపి వడగట్టి నీరు తీసేవేయాలి, పెరుగులో రంగు కలిపి అది చికెన్ ముక్కలలో వేసి రెండు గంటల సేపు ఊరనివ్వాలి. సర్కాయర్స్ కు ఈ వూరిన ముక్కలను గుచ్చుండి. బొగ్గుల కుంపటిమీద నిప్పుల వేడిలో ముక్కలు ఉడుకుతూ కాలేలా తిప్పుతూ అన్ని వైపులా దోరగా వేయించాలి. మధ్యలో ముక్కల మీద నిప్పుల వేడిలో ముక్కలు ఉడుకుతూ కాలేలా తిప్పుతూ అన్ని వైపులా దోరగా వేయించాలి. మధ్యలో ముక్కల మీద నెయ్యి అద్దుతూ వుండాలి. ముక్కలు ఉడికిన తరువాత గుడ్లను ఒక పాత్రలో కొట్టి కలిపి ఆ మిశ్రమాన్ని చికెన్ ముక్కలతో తిప్పతూ పలచగా పోయండి. ఈ సొన పలుచని పొరలాగా చికెన్ ముక్క చుట్టూ ఏర్పడుతుంది. బాగా వేగిన తరువాత గరం మసాలా పొడి కొద్దిగా చల్లి చక్రాలుగా తరగిన ఉల్లి ముక్కలతో అలంకరించిన పళ్లెంలో పెట్టి వేడిగా వడ్డించండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: