మటన్.. ఈ మాంసాహారానికి ఎంతమంది ప్రియులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహార ప్రియులు ఎంతో మంది ఈ మటన్ ని తినడం ఎంతో ఇష్టపడుతారు. మటన్ ఫ్రై అంటే.. మరి మరి ఇష్టపడుతారు. అలాంటి ఈ మటన్ ఫ్రై ఎంతో రుచికరంగా ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంట్లో వారికీ చేసి పెట్టండి.  

 

కావాల్సిన పదార్థాలు...

 

మటన్‌ : కిలో,

 

మిరపపొడి : మూడుస్పూన్లు,

 

ధనియాల పొడి : ఒక స్పూను,

 

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ : ఒక స్పూను,

 

కొబ్బరి పేస్ట్‌ : ఒక స్పూను,

 

గసగసాల పేస్ట్‌ : ఒక స్పూను,

 

పసుపు : ఒక స్పూను,

 

ఉప్పు : తగినంత,

 

మటన్‌ మసాలా పౌడర్‌ : రెండు స్పూన్లు,

 

కరివేపాకు : ఒక రెమ్మ,

 

ఉల్లిపాయలు : చిన్నవి రెండు,

 

పచ్చిమిరపకాయలు : ఆరు,

 

నీళ్లు : చిన్న కప్పు,

 

నూనె : ఐదు స్పూన్లు,

 

తయారీ విధానం..

 

కుక్కర్‌ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న మటన్‌తో పాటు కరివేపాకు, పైన చెప్పిన మసాల దినుసుల పొడులు, అల్లం వెల్లుల్లి పేస్టు.. అన్నీ వేసి కలపాలి. మూడు విజిల్స్‌ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. ఆ తరువాత కుక్కర్‌ మూత తీసి.. నీళ్లు ఆవిరి అయ్యే వరకు స్టవ్‌ మీదే ఉంచాలి. మాడిపోకుండా బాగా కలుపుతుండాలి. పాన్‌ తీసుకుని నూనె వేసి.. ఉడికిన మటన్‌ మిశ్రమాన్ని అందులో వేయాలి. సన్నటి సెగ మీద పదిహేను నిమిషాలు ప్రై చేయాలి. కాస్త బంగారు వర్ణంలోకి వచ్చిన వెంటనే.. మటన్‌ మసాలా పౌడర్‌తో పాటు, కొత్తిమీర తరుగు, కాస్త ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాలయ్యాక దించేయాలి. అంతే మటన్ ఫ్రై రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: