ఈ ప్రపంచంలో దేవుళ్ళకి సైతం అమ్మ అంటే ఎంతో ప్రేమ ఉంది. సాక్షాత్తు ఆ కృష్ణభగవానుడే ఇద్దరు అమ్మలా ప్రేమను, ఆప్యాయతను పొందిన అదృష్టవంతుడు. పుట్టిన వెంటనే అమ్మ దేవకీ మాత ప్రేమకి దూరం అయ్యి.. యశోద మాతకి దగ్గర అయ్యాడు.. ఇద్దరు అమ్మలా ముద్దుల బిడ్డగా ఎదిగాడు. పెరిగి పెద్ద అయ్యాక కన్న అమ్మ కి దగ్గర అయ్యాక కూడా పెంచిన ప్రేమను మర్చిపోలేదు.. కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కనిపించే ప్రతి దేవత కూడా అమ్మే కదా అని మన కన్నయ్య నిరూపించాడు.
కన్న బిడ్డ కాకపోయినా సరే కృషుడ్ని పెంచి పెద్ద చేసింది యశోద మాత. అది అమ్మ ప్రేమ అంటే. అమ్మ ప్రేమని మించిన అనురాగం మరెక్కడా దొరకదు. మాతృత్వపు మమకారం మాటలకు అందనిది. అమ్మతనపు గొప్పదనం అక్షరాలకు అతీతం.. కొడుకు తప్పు చేసిన సరిదిద్దుతుంది. సరైన మార్గంలో నడిపిస్తుంది అమ్మ. అందుకే అమ్మని మించిన దైవం లేదు. కనిపించని ఆ దేవుడి కన్న కని పెంచిన ఆ అమ్మే మనకు దేవత.. అమ్మ గూర్చి ఎంత చెప్పిన ఎంత చేసిన తక్కువే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి