ఇప్పటిరోజుల్లో సినిమా ఇండస్ట్రీ లో రాణించాలంటే అవకాశాలు చాలా తక్కువ. కానీ అవకాశాల కోసం తీవ్రంగా శ్రమిస్తే తప్పకుండ వస్తాయి ఇలా అనడానికి ఇప్పుడు చెప్పబోతున్న ఒక యువతీ కథే నిదర్శనం. ఈ యువతీ సింగర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేది చివరికి సాధించింది. మరి ఆ కథేంటో ఇప్పుడు మనం తెలుసుసుకుందాం.
నేను ఢిల్లీ లో చదుకునేటపుడు ఒక పక్క పాటల పోటీల్లో పాల్గొంటూ ప్రైజులు గెలిచేదాన్ని మరో వైపు చదువులోనూ రాణించేదానిని నా ప్రతిభను మా అధ్యాపకులు ఎన్నడూ గుర్తించలేదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడే మా నాన్న చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకోడానికి చాలా సమయమే పట్టింది. నేను యుక్త వయసులోకి అడుగుపెట్టగానే లక్ష్యం వైపుగా అడుగులు వేయాలని అనుకున్నాను. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు సింగర్ కావడాన్ని మర్చిపో, ఏదైనా ఉద్యోగం చేయి అని అన్నారు. ఆ సమయం లో అమ్మ నాకు అండగా నిలిచింది. ఆమె నేను సింగర్ అవడాన్ని బాగా ప్రోత్సహించింది. దానితో కాలేజీ చదువును వెంటనే పూర్తి చేసి సింగర్ అవాలని నిర్ణయం తీసుకున్నాను.
సింగర్ అవడం కోసం అన్ని విద్యలు పూర్తి చేసి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆలా అవకాశాల కోసం ముంబై కి వెళ్ళాను. ఆలా మ్యూజిక్ డైరెక్టర్లు ఇంటి చుట్టూ వారి ఆఫీస్ చుట్టూ తిరిగి నేను పాడిన పాటల సీడీ లను వారికీ ఇచ్చేదానిని ఆ విధంగా ఓ సంగీత దర్శకుడు ఒక పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఆలా 'దేవ్ డి' అనే సినిమాలో మొదటి పాటను పాడాను. ఆ తర్వాత నాకు వరుస అవకాశాలు అనేవి రావడం ప్రారంభమైయ్యాయి. ఇప్పటివరకు నేను యాభైకిపైగా పాటలు పాడాను.ప్రస్తుతం నా సింగర్ కెరీర్ బాగానే ఉంది. నాలాగా ఎవరైనా మొండిగా అనుకున్న లక్ష్యం వైపు కష్ట్టపడితే తప్పకుండ చేరుకుంటారు. మీ లక్ష్యం నెరవేరాలంటే మొండిగా ఉండక తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి