గర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భం ధరించినప్పుడు వచ్చే ఎలాంటి కాంప్లికేషన్ అయినా ఆందోళన కలిగించేదే అయినా ఈ విషయంలో కొన్ని మంచి వార్తలే ఉన్నాయి. తల్లి కాబోతున్న వారు జెస్టేషనల్ డయాబెటీస్‌ని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, అవసరాన్ని బట్టి డాక్టర్ సూచన ప్రకారం మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడం వల్ల మీరూ మీ బేబీ హెల్దీగా ఉండడమే కాక ప్రసవ సమయంలో వచ్చే సమస్యలని ప్రివెంట్ చేయవచ్చు.

ఇక చాలా మంది స్త్రీలలో జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల ఈజీగా గమనించగలిగే లక్షణాలు పెద్దగా కనపడవు. ఎక్కువ దాహంగా అనిపించడం, ఎక్కువ సార్లు బాత్రూం కి వెళ్ళాల్సి రావడం జరుగుతూ ఉంటే చెక్ చేయించుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంప్పుడే మీ డాక్టర్ ని కలవడం మంచిది. వారు మీ ఓవరాల్ హెల్త్ తో పాటు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ని కూడా చెక్ చేస్తారు. మీరు ప్రెగ్నెంట్ అయిన తరువాత మీ ప్రీనేటల్ కేర్ లో భాగంగా మీకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నదేమో కూడా చెక్ చేస్తారు.

అయితే మీకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే కనుక మీరు తరచుగా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. మీ డెలీరీకి ముందు మూడు నెలల్లో మీ బ్లడ్ షుగర్ లెవెల్, మీ బేబీ హెల్త్ ని కూడా మానిటర్ చేస్తారు. కొంత మందికి జెస్టేషనల్ డయాబెటీస్ యొక్క రిస్క్ ఎక్క్వూగా ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏమిటంటే.. అధిక బరువు, ఒబేసిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడ. ఇంతకు ముందు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి ఉండడం, లేదా ప్రీ డయాబెటీస్. పీసీఓఎస్, కుటుంబంలో దగ్గర వ్యక్తులకి డయాబెటీస్ ఉండడం. ఇంతకు ముందు నాలుగు కేజీల కంటే ఎక్కువ బరువున్న బేబీని డెలివర్ చేయడం.

మరింత సమాచారం తెలుసుకోండి: