
ఇక రోజు బాత్ రూమ్, పాస్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు కుట్లు బాగా ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే, కాళ్ళ మధ్య వెచ్చని నీరు పోయండి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ చిట్కా తో బాగా రిలీఫ్ వస్తుంది. డెలివరీ తర్వాత రక్తస్రావం చాల సాధారణం కాబట్టి మెటర్నిటీ ప్యాడ్స్ రోజంతా అనుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుట్లు సున్నితంగా ఉంటాయి కనుక యోని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.
అంతేకాదు.. ప్రతి నాలుగు గంటలకు ఒక సారి ప్యాడ్స్ మార్చుకోండి. సౌకర్యంగా ఉండటం కోసం కాటన్ ప్యాడ్స్ వాడడం మంచిది. ఉప్పు కు గాయం త్వరగా మాన్పగల శక్తి ఉంటుంది. కాబట్టి స్నానం చేసే సమయంలో వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చాలా కొంచెం ఉప్పు మాత్రమే వేయాలి… మరి ఎక్కువ వేసుకుంటే మీ చర్మంలో తేమ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
అయితే తడిగా ఉంటే ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం బాగా ఎక్కువ. కాబట్టి కుట్లు అసలు తడిగా లేకుండా చూసుకోండి. స్నానం చేసేటప్పుడు బాత్ రూమ్ కి వెళ్ళినప్పుడు కచ్చితంగా తడుస్తాయి. అందువల్ల వెంటనే కాటన్ తో కానీ మెత్తని గుడ్డతో కానీ కుట్లు మీద పెట్టి చాలా నెమ్మదిగా అదమండి. పొరపాటున కూడా రుద్దకూడదు అని గుర్తు పెట్టుకోండి.