
భూదేవి అంత సహనం ఉన్నదే మహిళ అని చెప్తారు పెద్దలు. దానిని విపరీతంగా పరీక్షిస్తూ ఆమె సహనాన్ని కోల్పోయే విధంగా అనుక్షణం ఇబ్బంది పెడుతున్నారు. దేవుడు, దేవతలను పూజించే భారత్ లో ఇలాంటివి పెరిగిపోవడంపై చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మహిళలను పూజించడం పక్కన పెడితే కనీసం వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వడం లేదు. కనీసం పసిపిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు అంటే ఇక్కడ మగాళ్లు ఎంత మృగాళ్ళుగా మారుతున్నారో తేలిపోతుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ట్రైనీ అధికారిణి పై ఫ్లైట్ లెఫ్టినెంట్ లైంగిక దాడి చేసినట్టు పిర్యాదు చేసింది.
వివరాలలోకి వెళితే, చెన్నై లోని స్థానిక గాంధీపురంలో ని ట్రైనింగ్ సెంటర్ లో మహిళా అధికారిణి ట్రైనింగ్ కోసం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఆటలు ఆడుతూ గాయపడ్డారు. దానితో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో వైద్యులు ఔషదాలు ఇస్తుంటారు కాబట్టి వాటిని వేసుకొని పడుకుంది ఆమె. ఔషదాలు అంటే వాటిని వాడినప్పుడు మత్తునిద్ర పట్టడం సహజం. అలా గాఢనిద్రలోకి జారుకున్న ఆమెపై ఒక ఫ్లైట్ లెఫ్టినెంట్ అత్యాచారం చేశాడు. నిద్ర మేల్కొన్న తరువాత ఆమె తన స్థితిని గమనించి తనపై అత్యాచారం జరిగినట్టు తెలుసుకుంది. దానిపై ఉన్నత అధికారులకు పిర్యాదు చేసింది. జరిగింది తెలిసినా అధికారులు స్పందించకపోవటంతో స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వాళ్ళు పిర్యాదు నమోదు చేసుకొని సదరు అధికారిని ఖైదు చేశారు. అయితే ఈ ఖైదు చేసే పరిధి విషయంలో పలు అనుమానాలు ఉండటంతో వాళ్ళు దానిపై చర్చలు జరుపుతున్నారు.