
ఆడపిల్లలకు ప్రేమ, కరుణ చాలా అవసరం. కొన్ని విషయాలను ఆడ పిల్లలతో షేర్ చేసుకోలేము. అలాంటి విషయాలను వ్యక్తికరించవచ్చు. ప్రేమను ఎంతగా ఇవ్వాలి. ఎవరితో కరుణతో మెలగాలనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఆడపిల్లలకు తమ తండ్రి ఎంత ఇష్టమైనా.. స్త్రీ అనే భావన కారణంగా కూతుళ్లు తమ తల్లినే రోల్ మోడల్‌గా తీసుకుంటారు. అందుకే తల్లులు మీ కూతురిని కష్టపడే గుణాన్ని అలవర్చాలి. కలలు, లక్ష్యాలను ఎప్పటికీ వదులుకోవద్దనే ధైర్యాన్ని ఇవ్వాలి. తనని తాను తెలుసుకునేలా ప్రయత్నించాలి. ఇతరులను అర్థం చేసుకోవడం, ఆదరించడం వంటి లక్షణాలు నేర్పించాలి.
ఆడ పిల్లలు తమ బాధ్యతలను తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. దానికి అవసరమైన స్వేచ్ఛను తల్లిదండ్రులు కల్పించాలి. ప్రపంచం కేవలం నాలుగు గోడలకే పరిమితం కాదని, బయట వేరే ప్రపంచమే ఉంటుందని ధైర్యాన్ని నింపాలి. ప్రతిఒక్కరికి జీవితంలో ఇలా.. ఈ స్థాయిలో బతకాలనే ఆలోచనలు ఉంటాయి. వారి కలల్ని నాలుగు గోడలకే పరిమితం చేసినట్లయితే.. జీవితాంతం బాధపడతారు. అందుకే వారికి స్వేచ్ఛను కల్పించాలి. సమాజంలోని ఒడిదుడుకులను ఎదుర్కొనేలా ధైర్యాన్ని ఇవ్వాలి. ఎల్లప్పుడూ మేమున్నామనే నమ్మకాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలి. అప్పుడే మీ పిల్లలు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయగలరు.