
కాగా.. సహజంగా గర్భిణులు ప్రకృతి ప్రసాదించిన రాజ్మా గింజలను తీసుకుంటే..వారికి ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇక ప్రతి గర్భవతి కచ్చితంగా తినవలసిన అతిముఖ్యమైన గింజల్లో రాజ్మా ఒక్కటి అని చెప్పాలి. ఇది శాస్త్రీయంగా నిరూపించారు. ప్రగ్నెసీ సమయంలో లోపల ఉండే శిశువు ఎదగాలి అంటే..కొత్తకణాలు పుట్టాలని చెబుతున్నారు. అయితే ఆ కణ నిర్మానానికి అతిముఖ్యమైన అవసరం ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం అని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో వైద్యులు కచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాలని చెబుతున్నారు. ఒక్కవేళ గర్భిణీలు ఆ టాబ్లెట్స్ వేసుకోకుంటే చాలా నష్టం జరుగుతందని చెప్పుకొచ్చారు.
ఇక సాధారణంగా ప్రతి గర్భిణీ స్త్రీ ఒకరోజుకు 400-800 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ కావాలని చెబుతున్నారు. అయితే నెలలను బట్టి ఎక్కువగా అవసరం అవుతుందని అన్నారు. ఇక మామాలుగా మహిళలకు 400 మైక్రో గ్రాములు సరిపోతుందని అంటున్నారు. ఇక ఫోలిక్ యాసిడ్ అనేది రాజ్మాగింజల్లో పెసర్లు, బొబ్బర్లు, శనగలకంటే కూడా డబుల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే 100 గ్రాముల రాజ్మా గింజల్లో 316 మైగ్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అందుకే గర్భవతులు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడకుండా ఈ రాజ్మా గింజలను వాడుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.