బైక్ లను ఇష్టపడి యువత అంటూ ఎవరు ఉండరు. అయితే బైకు ఇష్టపడే యువతకు ఓ ప్రముఖ కంపెనీ తీపి కబురు చెప్పింది. తాజాగా హీరో మోటర్స్ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA) సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇక RSAను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హీరో కంపెనీ సిబ్బంది సాయం చేస్తారని నిపుణులు తెలిపారు.

హీరో బైక్ యూజర్లు హీరో మోటోకార్ప్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఈ సేవలను పొందవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద రూ.350కే ఈ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. సమీపంలో ఉన్న హీరో డీలర్‌ను సందర్శించి సబ్‌స్ట్రైబ్ చేసుకోవచ్చని హోరో మోటోకార్ప్ సంస్థ వెల్లడించింది. RSA కింద వినియోగదారులకు లభించే సేవలు లభిస్తాయని నిపుణులు తెలిపారు. అవి ఆన్ కాల్ సపోర్ట్, స్పాట్‌లో బైక్ రిపేర్, సమీప హోరో వర్క్‌షాప్‌కు బైక్ తరలించడం. ఫ్లాట్ టైర్ సపోర్ట్, బ్యాటరీ జంప్ స్టార్ట్యాక్సిడెంటల్ సపోర్ట్, కీ రిట్రీవల్ సపోర్ట్, సేవలు ఉన్నట్లు తెలిపారు. హీరో ప్రీమియం రేంజ్ బైక్స్ ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్, ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, ఎస్‌పల్స్ 200కి ఒక ఏడాది పాటు RSA ఉచితంగా లభిస్తుందన్నారు.

ఇక అక్టోబరు 1, 2020 నుంచి ఇది వర్తిస్తుందని తెలిపారు. అటు దేశవ్యాప్తంగా వినియోగదారులకు తమ సేవలపై అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది హీరో మోటోకార్ప్. అంతేకాదు అక్టోబరు 10 నుంచి 6వేల ప్రాంతాల్లోని కస్టమర్ టచ్ పాయింట్స్ వద్ద ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. సర్వీస్ లేబర్ చార్జీలపై డిస్కౌంట్, ఉచిత వాషింగ్, పాలిషింగ్, నైట్రోజన్ ఫిల్లింగ్, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ప్యాకేజ్, కొత్త బైక్‌ల కొనుగోలుపై ఆకర్షణీయ ఎక్స్‌చేంజ్ ఆఫర్, గుడ్ లైఫ్ కస్టమర్లకు అదనపు పాయింట్లు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA)కి సంబంధించి పూర్తి వివరాల కోసం సమీపలో ఉన్న హీరో మోటోకార్ప్ డీలర్‌ను సంప్రదించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: