సీఎంగా జగన్ అనేక పర్యటనలు చేస్తుంటారు. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అందులో చాలా వరకూ ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు ఉంటాయి. అయితే.. ఆ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో లోకల్ లీడర్లకు జన సమీకరణపై టార్గెట్‌లు విధిస్తున్నారట. రామాయపట్నం లో జగన్ ఫంక్షన్ పెడితే 60 వేల మంది తీసుకురావాలని ఆదేశించారని ఇటీవల ఓ లీడర్ చెప్పుకొచ్చారు.


ఒంగోలు సభలో  జనాలు లేక వెలవెల బోయిందంటున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు.. జగన్ గ్రాఫ్ బాగుందని అన్నారు...  సభలు పెడితే జనాలు రావడం లేదని అంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తిట్టకుంటే ఎం చేస్తాయి... దానికి కేసులు పెడతారా అని రఘు రామ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాలో జగన్ సీఎం చంద్రబాబు నాయుడును బంగాళాఖాతంలో కలపాలని అన్నారని.. కనీసం జగన్ 41 a కింద నోటీసులు కూడా ఇవ్వలేదు నాటి ప్రభుత్వం అని రఘు రామ గుర్తు చేశారు. తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదంటున్న రఘురామ.. ప్రభుత్వం సంయమనం పాటించాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: