గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కొన్ని రోజులుగా తెలుగు రాజకీయాలను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వీడియో గురించి వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని  ఓ సంచలన ఆరోపణ చేశారు. ఎన్టీఆర్‌ చిన్న కూతురు ఆత్మహత్య ఇష్యూ నుంచి డైవర్షన్ కోసమే గోరంట్ల మాధవ్‌ పై ఫేక్ వీడియో విడుదల చేశారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ కూతురి ఆత్మహత్యకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కారణమని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం ఊపందుకుందని.. ఆ సమయంలోనే దాన్నుంచి డైవర్షన్ కోసం మాధవ్‌ పేరిట ఒక వీడియోను రిలీజ్‌ చేశారని మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారు.

ఒక మహిళ ఆత్మహత్యకు కారణమైన చంద్రబాబు, లోకేశ్‌... దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మాధవ్‌ వీడియో రూపొందించి రిలీజ్‌ చేశారని మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారు. ఆ వీడియోను పబ్లిక్‌లోకి వదిలి, అందరి దృష్టి మరల్చే ప్రయత్నం చేసుకుంటున్నారన్నారు. తన మరదలు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ నింద తనపై పడితే.. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు మాధవ్‌ వీడియోను రిలీజ్‌ చేశాడని కొడాలి నాని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: