చాలా మంది ఆడవారు వారి చర్మం తెల్లగా, కాంతివంతంగా ఉండాలని చాల విధమైన క్రీముల్ని, ప్రాడక్టుల్ని వాడుతుంటారు కానీ తెలియని విషయమేంటంటే అవి మీ చర్మానికి హాని తలపెడతాయని అలాగే చర్మం ముదిబారిపోయేలా చేస్తాయన్నది నిజం. సాధారణంగా నేచురల్ స్కిన్ ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకోవటం సహజం. అలాగే కాలుష్యం వల్ల కలిగే దుమ్ము ధూళి, సూర్య కాంతి వల్ల వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. చర్మం కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండకపోవటం వల్ల కూడా ఇలా జరుగ వచ్చు. వాతావరణం, కాలుష్యం, చర్మానికి తగినంతా ఆక్సీజన్ సరిపోకపొవటం వాటి వల్ల చర్మం కాంతి విహీనమైపోతుంది. అయితే రంగు ఉండే వ్యక్తులకు అన్ని రకాల రంగులూ నప్పుతాయి.కాకపోతే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలావరకూ మంచి రంగును తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని ఫేస్ప్యాక్స్ మీ కిచెన్ లోనే ఉన్నాయి.
చర్మం కాంతివంతంగా ఉంటానికి చిట్కాలు :
ఒక సగం టేబుల్ స్పూన్ తేనెను ఒక కప్పు టే నీరు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండితో కలపాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని చక్కగా ముఖానికి పట్టించి మస్సాజ్ చేసుకోవాలి. మస్సాజ్ స్ట్రోక్ లను జాగ్రత్తగా ఇవ్వాలి. తర్వాత 15-20 నిముషాల పాటు ఉంచుకున్న తర్వాత నెమ్మదిగా ఆ ఫేస్ మాస్క్ ను జాగ్రత్తగా తీసేయ్యాలి. అలాగే స్చ్రబ్ చేస్తూ తీయాలి. ఎందుకంటే ముఖం మీద ఉన్న మృత చర్మం కూడా వచ్చెలా చూడాలి. అయితే బియాపు పిండి మంచి స్క్రబ్బర్ గా పని చేస్తుంది. అలాగే తేనె చర్మ సౌందర్యానికి కాంతివంతం చేయటంలో తోడ్పడుతుంది.
ఒక టేబుల్ స్పూన్ పాలను తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తేనె అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలను కలుపుకోవాలి. వీటిని జాగ్రత్తగా మిశ్రమం గా కలుపుకోవాలి. తర్వాత ముఖానికి రాసుకోవాలి. తర్వాత 15 నిముషాలు పాటూ వదిలేయాలి. తర్వాత మామూలు నీటితో కడుగుకోవాలి.
ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని,ఒక టేబుల్ స్పూన్ టొమోటొ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ ఓట్మీల్ కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. తర్వాత 15-20 నిముషాలు ఉంచుకోవాలి. తర్వాత మామూలు నీటితో వాష్ చేసుకోవాలి. మెల్లగా రబ్ చేసుకుంటే ఓట్మీల్ వల్ల మీ మృత చర్మం ఊడిపోతుంది.
బంగాళా దుంపా చాలా వాటికి ఔషధం. ఎందుకంటే దీనిలో విటమిన్-సి బాగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని చక్కగా నిలబెడుతుంది. బంగాళా దుంప గుజ్జు తీసుకుని ముఖానికి రాసుకోండి. అలాగే ఎండేంత వరకూ ఉంచుకోండి. 30 నిముషాల తర్వాత కడుగుకోండి. ఇలా రోజూ చేస్తే చాలా వరకూ మీ చర్మం మారుతుంది.
పెరుగులో మిల్డ్ బ్లీచింగ్ ఉంటుంది. అంతేకాక ఇది మంచి మోయిస్చరైజర్ గా పని చేస్తుంది. ఓట్మీల్ మీ చర్మంపై ఎంతో పనిచేస్తుంది. ఇది చర్మం పై ఉన్న మృత కణాలపై పని చేసి అద్భుత కృత్యాల్ని చేస్తుంది. టొమోటో ఒక మంచి రక్తస్రావ నివారిణిగా పని చేస్తుంది. దీని వల్ల ముఖం మీద రక్త ప్రసరణ బాగా పని చేసేలా చేస్తుంది. దీనిని వారానికి ఒకసారి వేసుకుంటే మంచిది.