''వక్షొజాలు చాలా చిన్నవిగా ఉన్నాయి దానికి కారణం హార్మోన్ల ప్రభావమేనా..?, ట్రీట్ మెంట్ చేయించుకుంటే మార్పు వస్తుందా..?, చికిత్స కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైన ఎదురయితాయా..? ఈ విధమైన సందేహాలు పలువురు మహిళలను వేధిస్తుంటాయి.'' 'వక్షోజాలు చిన్నవిగా ఉండటం చేత అధిక శాతం మంతి టీనేజ్ యువతులు నిరాశకు లోనవుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ విధంగా నిస్తేజానికి లోనవుతున్న యువతులు ఆత్మవిశ్వాసమే అసలైన ఆకర్షణని నిపుణులు సూచిస్తున్నారు' అవ్వాల్సిన వయసులో రజస్వలు కాకపోవడం, అండాలు సరిగా విడుదల కాకపోవటం, పోషకాల వెలితి తదితర హార్మోన్ల లోపాల కారణంగా 'వక్షోజాల' ఎదుగుదల మందగిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే హార్మోన్ల ప్రభావం కారణంగా ఎదుగుదల లోపం ఉన్నవారికి 'హార్మోన్ల చికిత్స' ద్వారా స్తనాలను వృద్థి చేసే అవకాశముందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. స్తన సంబంధిత సమస్య పరిష్కారానికి వ్యాయామం తోడ్పడుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వక్షోజాల ఆకృతిలో వయసు, ఇతర కారణాల చేత మార్పులు వస్తాయట. ఈ విషయాన్ని బాధిత స్త్రీలు దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైన సమస్యను ఎదుర్కొంటున్నవారు సంబంధిత వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటిస్తే మేలుంటుందంటూ అధ్యయనాలు విశ్లేషిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: