చుండ్రును నివారించాలంటే కుదుళ్లలో ఉండే అసిడిక్ పీహెచ్ స్థాయి సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. ఆరు స్పూన్ల నీళ్లను రెండు స్పూన్త వెనిగర్ తో కలిపి దూదితో శిరోజాల మొదళ్లలో చర్మంపై రాసుకోవాలి. ఇలా వారినికో రోజు నిద్రించడానికి ముందుగా రాసుకుని మర్నాడు ఉదయం వెనిగర్ కలిపిన నీటితో తలస్నానం చేయాలి. ఇలా కనీసం మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. 


రెండు గుడ్ల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను కలుపుకోవాలి.తలను నీళ్లతో తడుపుకుని ఆ మిశ్రమాన్ని తలపై రాసుకుని మర్ధన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేస్తే చుండ్రు, జుట్టు రాలేసమస్య తగ్గిపోతుంది. గోరు వెచ్చని కొబ్బరి నూనె లేక ఆముదాన్ని వారానికి రెండు సార్లు రాత్రి నిద్రించడానికి ముందుగా తలకు పట్టించుకోవాలి.


తర్వాత వేళ్లతో తలపై గుండ్రంగా మర్ధన చేసుకోవాలి. ఇలా అరగంట పాటు చేసి మర్నాడు ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా అరగంట పాటు చేసి మర్నాడు ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తల పొడిగా మారకుండా ఉంటుంది. చుండ్రు తగ్గిపోతుంది. అలాగే శిరోజాలు రాలకుండా ఉంటాయి.


రాత్రి సమయంలో పెరుగులో మెంతులను నానబెట్టి మర్నాడు ఉదయం దాన్ని రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. అర్థగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు చక్కని పోషణ లభిస్తుంది. తలస్నానం చేయడానికి పదిహేను నిమిషాల ముందుగా అలోవెరా జెల్ ను తలకు రాసుకోవాలి. తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా ప్రతిరోజూ లేదా రెండు మూడు రోజులకోసారి చేయడం వల్ల చుండ్రు సమస్యను దూరంగా ఉంచవచ్చు. ఒక గిన్నె నీటిని వేడిచేసి అందులో ఒక గుప్పెడు రోజ్ మెరీ ఆకులను వేసి నానబెట్టాలి.


అలా ఒక రాత్రంతా ఉంచి మర్నాడు ఉదయం అందులో రెండు స్పూన్ల వెనిగర్ ను కలపాలి. షాంపూతో తలంటుకున్న తర్వాత ఈ నీటితో శిరోజాలను కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు రాకుండా ఉంటుంది. కొబ్బరి నూనెకు ఆలివ్ నూనెను కలిపి తలస్నానం చేయడానికి అర్థగంట ముందు తలకు రాసుకుని తేలికగా మర్ధన చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేస్తే సరి. హెన్నా కూడా చుండ్రుని నివారించడంలో చక్కగా తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు హెన్నాని తలకు పట్టించి మర్నాడు తలస్నానం చేయండి.


ఇందులో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ వెనిగర్ కలిపి దాన్ని తలపైన రాసుకుని మర్ధన చేసుకోవాలి. అర్థగంట తర్వాత గుడ్డుతో తలస్నానం చేయాలి. ఎండిన నారింజ పండు తొక్కలు, ఉసిరికాయ పెచ్చులు, కుంకుడుకాయలు, శీకాయలను సమంగా కలిపి నీళ్లకు చేర్చి మరిగించి తలస్నానం కోసం వాడాలి. దీనికి ముందు పుల్లని మజ్జిగను తలకు పట్టించాలి. కొబ్బరినూనెకు నిమ్మరసం కలిపి జుట్టుకు కుదుళ్లకు పట్టించి గంట తర్వాత శీకాయ కషాయంతో తలస్నానం చేయాలి

మరింత సమాచారం తెలుసుకోండి: