ఆరెంజ్ చూడ‌డానికి, తిన‌డానికి ఎంతో చ‌క్క‌గా ఉంటుంది. ఆరెంజ్‌లో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాతం మంచి దీన్ని ఇష్ట‌ప‌డ‌తారు.  సిట్రస్ జాతికి చెందిన ఆరెంజ్ తిన‌డం వ‌ల్ల ఎన్నీ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో.. దాని తొక్క‌లతో కూడా అంతే ప్ర‌యోజ‌నం ఉంది. న‌రింజ తొక్క‌ల‌తో అందానికి చేసే మేటు అంతా ఇంతా కాదు. ఆరెంజ్ తిన‌డం వ‌ల్ల శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. 


నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఇక ఆరెంజ్ తొక్క‌ల‌తో ఎన్నో సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- ఎండిన నారింజ తొక్క పొడిలో పెరుగు కలిపి ఫేస్‌ ప్యాక్ వేసుకోవాలి. కొన్ని స‌మ‌యం తర్వాత చల్లని నీటితో వాష్‌ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ ముఖంపై ఏర్పడిన మృత చర్మాన్ని పోగొట్టేలా చేస్తుంది.


- ఆరెంజ్ పేస్ట్‌లో కొద్దిగా తేనె, నిమ్మ ర‌సం క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మురికి తొల‌గి కాంతివంతంగా క‌నిపిస్తుంది.


- ఆరెంజ్‌ తొక్కల పొడిలో పాలు మిక్స్ చేసి ఫేస్‌కు ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ వ‌ల్ల ముఖంపై ఉన్న జిడ్డును తొల‌గించ‌డంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది.


- ఆరెంజ్ తొక్క‌ల పొడిలో రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి, దాని ఫేస్‌కు అప్లై చేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.


- ఆరెంజ్ తొక్క‌ల పొడిలో కొద్దిగా స్వ‌చ్ఛ‌మైన ప‌సుపు క‌లిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం నిగారింపుగా క‌నిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: