మన దైనందిన జీవితంలో ఎన్నో జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పొడిబారం వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక ముఖ్యంగా ఎంత మంచి షాంపూలు వాడినా, బ్రాండెడ్‌ నూనెలు వాడినా జుట్టురాలిపోతూనే ఉంటుంది. దీంతో ఈ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాయని భావించి, మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నించి భంగపడతారు. కానీ, స‌మ‌జ ప‌ద్ధ‌తిలోనే ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. అలాంటి వాటిలో నిమ్మ‌రసం కూడా ఒక‌టి. 

 

నిమ్మరసంను జుట్టుకు అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ ను బలోపేతం చేయడం మాత్రమే కాదు, జుట్టును పొడవుగా మరియు స్ట్రాంగ్ గా పెరగడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇటీవ‌ల కాలంలో చుండ్రు స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. జుట్టు చూడటానికి ఎంత పొడవుగా, ఒత్తుగా ఉన్నా.. త‌ల‌లో చుండ్రు ఉంటే జుట్టు అందంగా కనబడుదు. అయితే చండ్రును నివారించడంలో నిమ్మరసం మంచి పరిస్కార మార్గం, నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రు నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. ఇక అత్యంత ప్రాచుర్యం పొందిన సిట్రస్ పండ్లలో ఒకటి నిమ్మకాయ, నిమ్మకాయలోని విటమిన్ సి మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

 

అదేవిధంగా, నిమ్మరసం జుట్టును చిట్లకుండా నివారిస్తుంది. కాబట్టి, జుట్టు చివర్లను అప్పుడప్పు కట్ చేస్తుండాలి. అలాగే 5 నుండి 6 టీస్పూన్ల నిమ్మరసంను జుట్టు పొడవునా అప్లై చేయాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. అలాగే నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె సమంగా తీసుకుని మొత్తం పదార్థాలను మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పూర్తిగా అప్లై చేయాలి. ఒకటి లేదా రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు చేయ‌డం వ‌ల్ల జుట్టుకు తగిన బలాన్ని చేకూర్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: