సాధార‌ణంగా ప్రతిరోజూ పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పాలు శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు.. మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. రోజూ మూడు గ్లాసుడు పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే పాలు కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు చ‌ర్మాన్ని మెరిపించ‌డంలోనూ బాగా స‌హాయ‌ప‌డుతుంది. మ‌రి పాల‌ను ఎలా వాడితే.. మెరిసే చ‌ర్మం పొంద‌వ‌చ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

IHG

వాతావరణ సమస్యలు, పోషకాల లేమి ఇలా కారణం ఏదైనా కొందిరి చర్మం నిర్జీవంగా ఉంటుంది. ఇలాంటి వారు కొద్దిగా పచ్చిపాలల్లో చిటికెడు ఉప్పు వేసి రాత్రి పడుకొనే ముందు చేతులు, మెడ, ముఖం భాగాల్లో రాసుకుని.. ఉద‌యం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకుంటే చ‌ర్మం కొత్త మెరుపు సంత‌రించుకుంటుంది. అలాగే పాలలో ఉండే ప్రొటీ నులు, కొవ్వు వయసును ఎక్కువగా కనిపించకుండా చేస్తాయి. ముఖంపైన ఉండే ముడతలను కనిపించకుండా చేస్తాయి. 

IHG

అదేవిధంగా, దూదిని పాలలో ముంచి ముఖమంతా మర్ధనా చేసుకున్నాక, పావు గంట‌ పాటూ అలా వదిలేయాలి. అనంతరం చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు తొల‌గుతాయి. మ‌రియు ఎండిపోయి నట్లుగా, గురుకుగా ఉండే చర్మానికి ఇలా చేయ‌డం వ‌ల్ల తేమ కలిగిస్తుంది. ఎందుకంటే.. పాలను మించిన మంచి మాయిశ్చరైజర్‌ ఇంకొకటి లేదు. మీ చర్మం కాంతి పెంచడానికి పాలు, తేనె, నిమ్మరసం ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖంలో తప్పకుండా మార్పు తీసుకొస్తుంది. ఇందుకు పాలు, తేనె, నిమ్మరసం మూడు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: