ముఖం మీద మొటిమలు, మచ్చలు పోయి ముఖం  ఫ్రెష్ గా ఉండటానికి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు పాటించండి..  ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మృదువైన, సున్నితమైన, మరియు మచ్చలులేని మెరిసే చర్మం కోసం ఆరాటపడుతున్నారు. మనలో ప్రతి ఒక్కరూ బిజీ షెడ్యూల్, క్రమరహిత ఆహారపు అలవాట్లు, సరిపడనంత నిద్ర, కాలుష్యం వంటి వాటి వల్ల మచ్చలేని, కాంతివంతమైన చర్మాన్ని సాధించడం కష్టంగా ఉంది. కానీ అది అసాధ్యం కాదు. అందం మరియు చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు ఏవైనా సహజసిద్ధమైన ఉత్పత్తులకు సాటిరావు. కాబట్టి, ప్రకాశవంతమైన, మెరిసే చర్మం కోసం మీ వంటగదిలోని పదార్ధాలతో సులభంగా ఈ చిట్కాలను తయారు చేసుకుని ఉపయోగించి చూడండి.


1...మొటిమలతో బాధపడే టీనేజర్లు కెమికల్స్‌తో నిండిన ఉత్పత్తులను పక్కన పెట్టి, ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించడం ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు.

కావలిసిన పదార్థాలు:

ఒక టీ స్పూన్ - పసుపు
ఒక టీ స్పూన్ - వేపాకు పొడి
2 టీ స్పూన్లు - ముల్తానీ మట్టి
అర టీ స్పూన్ - మంజిష్ఠ
3-4 టీ స్పూన్లు - పాలు
ఒక టీ స్పూన్ - నీళ్ళు

తయారీ విధానం:

ఒక గిన్నెలో అన్ని పదార్థాలను తీసుకుని బాగా కలపండి. దాన్ని మీ ముఖానికి రాసుకోండి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో ముంచిన రుమాలుతో తుడవాలి. మంచి ఫలితాల కోసం, ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 3,4 సార్లు వాడండి.





2...మీ చర్మం ఫ్రెష్ గా ఉండటానికి మరియు మెరిసే చర్మం పొందడానికి, నిపుణులు డిటాక్స్ ఫేస్ మాస్క్‌ను సిఫారసు చేస్తున్నారు.

కావలిసిన పదార్థాలు:

అర టీ స్పూన్ - పసుపు
ఒక టీ స్పూన్ - వేపాకు పొడి
ఒక టీ స్పూన్ - మునగాకు పొడి
ఒక టీ స్పూన్ - అతిమధుర పొడి
ఒక టీ స్పూన్ - మంజిష్ఠ
మూడు టీ స్పూన్లు - ముల్తానీ మట్టి
ఒక టీ స్పూన్ - తేనె
2-3 టీ స్పూన్లు - పాలు మరియు నీళ్ళు

తయారీ విధానం:

అన్ని పదార్థాలను బాగా కలపండి. తరువాత ఆ మిశ్రమాన్ని మీ ముఖం మీద అప్లై చేయండి. ఫేస్ ప్యాక్ బాగా ఎండి పగలడం మొదలైన తరువాత దాన్ని తీసెయ్యండి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే అది మీ చర్మంలోని తేమను తీసివేస్తుంది కాబట్టి త్వరగా తీసెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: