
అందుకోసం ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ త్రిఫల పౌడర్ ని ఇంకా అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి రాత్రి అంతా కూడా వదిలేయాలి. ఆ మరుసటి రోజు వాటర్ ను ఫిల్టర్ చేసుకుని తాగాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఈ త్రిఫల వాటర్ ను తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చందనం పొడిని వేసుకోవాలి. ఇంకా అలాగే చిటికెడు పసుపు ఇంకా సరిపడా కొబ్బరి పాలని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పూతల అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తరువాత వాటర్ తో బాగా శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. రెండు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇలా చేయాలి. అంతే ఈ రెండు టిప్స్ పాటిస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు చాలా చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇంకా అలాగే మిమ్మల్ని మొటిమలు మళ్లీమళ్లీ వేధించకుండా ఉంటాయి.