మే 4వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో  మంది ప్రముఖుల  జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి ఈరోజు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.  

 

 త్యాగరాజు జననం : నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజు.ఈయన  1767 మే 4వ తేదీన జన్మించారు. త్యాగయ్య త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు త్యాగరాజు. త్యాగరాజ కీర్తనలు ఇప్పటికీ ఎంతగానో ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంటాయి. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని చూపిస్తూ వుంటాయి. అంతేకాకుండా ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి ఉంటాయి. అయితే ఆధునిక యుగంలో త్యాగ  రాజు కీర్తనలు అంటే తెలియని వారు ఉండరు. 

 

 

 దాసరి నారాయణరావు జననం  : ప్రముఖ సినీ దర్శకుడు నిర్మాత రచయిత రాజకీయ రాజకీయ నాయకుడు  అయిన దాసరి నారాయణ రావు... అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లోకెక్కాడు . దాదాపు 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించాడు దాసరి నారాయణరావు. 53 సినిమాలకు దర్శకుడిగా నిర్మాతగా కూడా వ్యవహరించారు. 250కి పైగా చిత్రాల్లో రచయితగా కూడా గీత రచయితగా కూడా పని చేశారు దాసరి నారాయణరావు. తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో నటించి తన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు. చిన్నప్పటినుంచి నాటక పోటీలలో పాల్గొన్న దాసరి నారాయణరావు అనతికాలంలోనే ప్రతిభగల రంగస్థల నటుడిగా ఎదిగారు. ఈయన  సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతూ దూసుకుపోయారు దాసరి నారాయణరావు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి . ఈయన 1942 మే 4వ తేదీన జన్మించారు.

 

 డీకే అరుణ జనం : ప్రముఖ రాజకీయ నాయకురాలు అయిన డీకే అరుణ గద్వాల  అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎన్నికవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించుకున్నారు. ఇక మంత్రివర్గంలో చోటు సంపాదించిన తొలి మహిళా నేతగా పేరు సంపాదించారు డీకే అరుణ. ఈమె  1960 మే 4వ తేదీన జన్మించారు. 2009లో మరోసారి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి గా నియమించబడ్డారు డీకే అరుణ.  

 

 త్రిష జననం : ప్రముఖ హీరోయిన్ త్రిష సినీ  ప్రేక్షకులందరికీ కొసమెరుపు. తెలుగు తమిళ ఇండస్ట్రీలో ప్రేక్షకులందరిని త్రిష ఎన్నో సినిమాలతో అలరించింది . దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ... ఎంతో గుర్తింపు సంపాదించింది.  ముఖ్యంగా తెలుగులో వర్షం సినిమాతో  ఎంతగానో గుర్తింపు సంపాదించింది త్రిష. ఇక ఆ తర్వాత కూడా టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో నటించేసింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష  ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తన నటనతో పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా ఈ ముద్దుగుమ్మ 1983 మే 4వ తేదీన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: