ఏపిలో ఓ వైపు కరోనా వైరస్  విలయ తాండవం చేస్తుంది. ఈ వైరస్ నుంచి ఎలా ప్రజలను సురక్షితంగా ఉంచాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికార, ప్రజా ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో రాజకీయ రగడ కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలో అధికార పార్టీ నేత, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలు వాడి వేడీ విమర్శలతో ఏపీ తెగ హీటెక్కిపోతుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచల ఆరోపణలు చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదంయ లేకుండా చంద్రబాబులానే కన్నా ఎందుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారో వారినే అడిగి తెలుసుకోవాలన్నారు.  

 

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ స్పందించింది. కన్నాపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. కన్నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని విజయసాయిరెడ్డికి హితవు పలికింది. ఇదిలా ఉంటే ఏపిలో కరోనా వైరస్ మూలంగా ప్రజలు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారని.. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష బాద్యతగా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయిన.. లేని పోని రాజకీయ రగడ సృష్టిస్తున్నారి విజయసాయి ఫైర్ అయ్యారు. మళ్లీ అడుగుతున్నా... కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా... అంటూ ట్విట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: