గల్ఫ్ దేశాల్లో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. అక్కడ ప్రతీ రోజు వేల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. శ‌నివారం న‌మోదైన 2,840 కొత్త కేసుల‌తో క‌లిపి సౌదీలో క‌రోనా కేసుల సంఖ్య 50వేలు దాటింది. అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,980 గా ఉంది. ఇక అక్కడ నిన్న పది మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇప్పటి వరకు 302 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మార్చ్ 2న కరోనా కేసు నమోదు కాగా ఇక గత వారం రోజుల నుంచి ప్రతీ రోజు కూడా 1500 కేసులకు పైగా నమోదు అవుతూనే ఉన్నాయి. అక్కడ రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: