ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిన్న చిత్తూరు, అనంతపురం మీదుగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా రాబోయే రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మిగతా ప్రాంతాలతో పాటు కోస్తా ఆంధ్రకూ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 11వ తేదీలోపే రాష్ట్రమంతటా ప్రవేశిస్తాయని అధికారులు చెబుతున్నారు. 
 
శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో నిన్న 82 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లా పెందుర్తిలో 67.5 మి.మీ, చిత్తూరులో 53.75 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే రెండు రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: