దేశంలో ఓ వైపు కరోనా మరణాలు ఏ విధంగా సంబవిస్తున్నాయో తెలిసిందే.  ముఖ్యంగా దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైలో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి.  ఒకదశలో చెప్పాలంటే.. చైనాను మించిన కేసులు నమోదు అయ్యాయి.  ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఘట్కోపర్‌లో విషాదం నెలకొంది. ఓ మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ.. మురికి కాల్వలో పడిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ముంబై ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇండియన్‌ నేవీ డైవర్స్‌ కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 

 

తమ పిల్లవాడు అప్పటి వరకు తమ ముందు ఆడుకొని ఎలా అటు వైపు వెళ్లాడో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.  వలలు, తాళ్ల సహాయంతో మురికి కాల్వలో బాలుడి ఆచూకీ కోసం సిబ్బంది గాలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోగా, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంత్‌నగర్‌ పోలీసులు దగ్గరుండి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలకు సహకరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: