సోమవారం రాత్రి గాల్వన్ లోయ దగ్గర భారత్– చైనా మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం సూర్యాపేటలో జరగనున్నాయి. సంతోష్ బాబు భార్య, పిల్లలు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డుమార్గాన సూర్యాపేటకు బయలుదేరారు.
సంతోష్ భార్య ఎయిర్ పోర్టు నుండి బయలు దేరుతూ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టడం అక్కడివారిని కలచివేసింది. సంతోష్ మృతితో సూర్యాపేటలో విషాదఛాయాలు అలుముకున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హాకీంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు సంతోష్ భౌతికకాయం వస్తుందని తెలుస్తోంది. అక్కడ సంతోష్ కు గౌరవ వందనం సమర్పించిన అనంతరం ఆయనను సూర్యాపేటకు తరలిస్తారని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి