ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పుడు విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి.  ముఖ్యంగా అక్రమ కట్టడాల విషయంలో ఏపీ సర్కార్ అనుసరించే వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా గీతం యునివర్సిటి ని ఏపీ సర్కార్ టార్గెట్ చేయడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గీతం యునివర్సిటి లో కూల్చివేతలను తప్పుపడుతూ హైకోర్ట్ కి వెళ్ళారు.

విశాఖ గీతం యూనివర్శిటీలో నిర్మాణాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. నేడు దీనిపై విచారణ జరిగింది. నవంబర్ 30 వరకు నిర్మాణాల కూల్చివేతపై స్టే ఇచ్చిన హైకోర్టు...  కౌంటర్ దాఖలు చేయాలని ఏపి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదిలా ఉంటే ఎలాంటి ఆర్డర్ లు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు తెల్లవారుజామున వంద మంది పోలీసులు వచ్చారు అని ఏపీ హైకోర్ట్ లో పిటీషనర్ వాదనలు వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: