ఏపీలో రెండో దశ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన
కృష్ణా జిల్లాలోని
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో
టీడీపీ విజయం సాధించింది. సర్పంచ్ గా పడమట దుర్గా శ్రీనివాసరావు 121 ఓట్లతో విజయం సాధించారు. గ్రామంలో ఉన్న పది వార్డుల లో ఎనిమిది
టిడిపి,
వైసిపి రెండు స్థానాలలో గెలుపు సాధించాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
ఎన్టీఆర్ స్వగ్రామంలో టిడిపి ని కలిసికట్టుగా గెలిపించుకున్నాం అని చెప్పారు. చంద్రబాబు హయాంలో మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది అని..
నారా లోకేష్ దత్తత తీసుకుని అనేక పనులు చేపట్టారు అని వారు గుర్తు చేసుకున్నారు.
వారు చేసిన అభివృద్ధి, సహకారం వల్లే ఈరోజు ఘన విజయం సాధించామని.. రెండేళ్లలో ఈ ప్రభుత్వం గ్రామ అభివృద్ధి ని అసలు పట్టించుకోలేదని...మమ్మలను నమ్మి ఘన విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అని
టీడీపీ నేతలు చెప్పారు. ఇక గ్రామంలో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం అని వారు ధీమాతో చెప్పారు. ఏదేమైనా నిమ్మకూరులో
టీడీపీ గెలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా
టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.