
ఆ లేఖలో ntr .. "నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను . గత కొద్ది రోజులుగా. మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమీచ్చి మీ రుణం తీర్చుకోగలను?. ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తి గా కోలుకుని, కోవిడ్ ను జయిస్తాను అని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూప ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనం గా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి పట్టునే ఉంటూ, లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్త గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్దే కానుక. ఇది వేడుకలు చేసుకునే సమయం కాడు. మన దేశం కరోనా తో యుద్దం చేస్తోంది. కనిపించని శత్రువు తో అలుపెరుగని పోరాటం చేస్తున్న మన డాక్టరు, నరులు మరియు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్త గా చూసుకోండి. మీరు జాగ్రత్త గా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం. చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనా ను జయిస్తుంది అని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు, మాస్క్ ధరించండి. జాగ్రత్త గా ఉండండి. నా వన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ" మీ ఎన్టీఆర్.