ఈ మూడు సినిమాలతో సూర్య – పోలీస్ పాత్రల మధ్య ఒక బలమైన అనుబంధం ఏర్పడింది. నిజంగా చెప్పాలంటే, పోలీస్ యూనిఫామ్‌లో సూర్య కనిపిస్తే ఆ స్క్రీన్‌కి ఒక ప్రత్యేకమైన పవర్ వచ్చేది. అయితే సింగం సిరీస్ తర్వాత చాలా కాలం పాటు సూర్య నుంచి మరో పూర్తి స్థాయి పోలీస్ జానర్ సినిమా రాలేదు. అభిమానులు కూడా “మళ్లీ ఎప్పుడెప్పుడు సూర్య పోలీస్ అవతార్‌లో వస్తాడా?” అని ఎదురుచూస్తూనే ఉన్నారు.ఇప్పుడు ఆ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. తాజాగా సూర్య తన 47వ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, ఈ చిత్రంలో సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ సినిమాను మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఆవేశం’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఆ సినిమాతో తన మేకింగ్ స్టైల్, ఇంటెన్స్ ప్రెజెంటేషన్‌కు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే దర్శకుడు సూర్యను ఒక బ్యాడాస్, పవర్‌ఫుల్ పోలీస్గా ప్రెజెంట్ చేయబోతున్నాడని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. సూర్య పాత్ర డిజైన్, అతని లుక్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా గత సినిమాల కంటే డిఫరెంట్‌గా ఉండబోతున్నాయట.ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ ప్రోమో కట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అదే ప్రోమో షూటింగ్ జరుగుతోందని, త్వరలోనే ఈ పవర్‌ప్యాక్డ్ ప్రోమోను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఒకవేళ ఆ ప్రోమో బయటకు వస్తే, సూర్య అభిమానులకు అది నిజంగా పండగ లాంటిదే అని చెప్పాలి.
మరి ఈసారి సూర్య ఎలాంటి పోలీస్‌గా అలరిస్తాడో, ఆయన ఇంటెన్సిటీ మళ్లీ ఎలాంటి రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి. ఒకటి మాత్రం క్లియర్ – సూర్య పోలీస్ అవతార్ అంటే స్క్రీన్ మీద అగ్ని పర్వతమే! ఇక ఈ సినిమాతో మరోసారి ఆయన పోలీస్ రోల్స్‌కు రాజా అని ప్రూవ్ చేస్తారేమో చూడాలి..??
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి