దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న " ఆర్.ఆర్.ఆర్ " మూవీలోని కొమరం భీమ్ పోస్టర్ ను జూ. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా నేడు రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో తారక్ ఉగ్ర రూపాన్ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఇక పలువురు సెలబ్రేటీలు ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్తూ " ఆర్.ఆర్.ఆర్ " లోని కొమరం భీమ్ పోస్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక " ఆర్.ఆర్.ఆర్ " లో కీలక పాత్ర పోషిస్తున్నబాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ట్విట్టర్ లో స్పందిస్తూ " దయ గల తిరుగుబాటు దారుడిగా తారక్ పోస్టర్ అదుర్స్ . హ్యాపీ బర్త్ డే తారక్ " అంటూ ట్వీట్ చేశాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: