ఒక వైపు కరోనా భూతం జనాలను పట్టి పీడిస్తుంటే మరోవైపు దాని కోసం ఇంటి వైద్యలు, సొంత వైద్యాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆనందయ్య పేరుతో కరోనా పసరు మందు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ న్యూస్ ఒకటి వ్యాపిస్తుంది. ఆనందయ్య పసరు మందుపై శాస్త్రీయ నిర్థారణ జరగాల్సి ఉండగా, తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ మందుపై సెటైర్స్ వేయడం ఒకింత సంచలనం గా మారింది. ఈ విషయం పై RGV వరస ట్వీట్లు చేసారు. ఆనంద‌య్య పసరు వాయుద్యానికి ఐసీఎమ్ఆర్ సరే అంటే ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే వాలిపోతుంది.. ? అంటూ చమత్కారం చేసారు. ఒకింత ఆనందయ్య కు మద్దతు పలుకుతూనే ఛలోక్తులు విసిరే ప్రయత్నం చేసారు వర్మ.






 

మరింత సమాచారం తెలుసుకోండి: