లోప‌ల నైపుణ్యం ఉండాలే గానీ ఎన్నో అద్భుతాలు సృష్టించ‌వ‌చ్చని నిరూపించాడు ఓ యువ‌కుడు . ఐస్క్రీం పుల్ల‌ల‌తో పూరీ జ‌గ‌న్నాత్ విగ్ర‌హాన్ని త‌యారు చేసి అంద‌ర్నీ అవాక్క‌య్యేలా చేశాడు . ఒడిస్సాకు చెందిన బిస్వాజిత్ నాయ‌క్ కు సాధార‌ణంగానే త‌న నైపుణ్యంతో ఎదైనా త‌యారు చేయాల‌న్న ఆశ‌లు ఉండేవి. అయితే స‌డెన్ గా ఐస్క్రీమ్ పుల్ల‌ల‌తో ఎదైనా త‌యారు చేయాల‌ని ఆయ‌న మొద‌డులో తట్టింది .

దాంతో ఆయ‌న మొత్తం 1475 ఐస్ క్రీం పుల్ల‌ల‌ను ఉప‌యోగించి పూరి జ‌గ‌న్నాథ్ గ‌జాన‌నా బేషా దేవుడి చిన్న విగ్ర‌హాన్ని త‌యారు చేశారు . త‌న‌కు ఈ విగ్ర‌హం త‌యారు చేయ‌డానికి ప‌దిహేను రోజులు ప‌ట్టింద‌ని బిస్వాజిత్ నాయ‌క్ చెబుతున్నారు. అంతే కాకుండా దేవ‌స్నాన పూర్నిమ సంధ‌ర్భంగా తాను ఈ విగ్ర‌హాన్ని భ‌క్తుల‌కు అంకితం చేస్తున్నాను అంటూ ప్ర‌క‌టించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: