ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల పంపకాల వివాదానికి సంబంధించి చేసిన వైఎస్ షర్మిల కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి దాకా ఈ అంశం మీద ఆమెను టార్గెట్ టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలకు ఆమె షాక్ ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన నీటి కోసం ఏపీ ప్రభుత్వాన్ని ఢీకొనేందుకు సిద్ధమని చెబుతూ వైఎస్‌ షర్మిల కామెంట్స్ చేశారు. 


ఒకరకంగా కొద్ది రోజుల నుంచి తెలంగాణ, ఏపీ మధ్య నీటి యుద్ధం జరుగుతోంది. ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరకంగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్‌ షర్మిల చేసిన ఓ ట్వీట్‌ మరింత రాజకీయ దూమారాన్ని రేకెత్తించింది. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం.. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం అంటూ ఆమె ట్వీట్ చేశారు. పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది స్వయానా అన్న కావడంతో ఆమె ఈ అంశం మీద స్పందించకపోవచ్చని భావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: