టీం ఇండియా యువ ఆల్ రౌండర్ రిశబ్ పంత్ ఈ మధ్య కాలంలో కాస్త హాట్ టాపిక్ గా మారుతున్నాడు. అతని ఆట కంటే కూడా ఇతర విషయాలు బాగా హైలెట్ అవుతున్నాయి. వికెట్ కీపర్ గా అలాగే బ్యాట్స్మెన్ గా మంచి ప్రసంశలు అందుకున్న ఈ ఢిల్లీ ఆటగాడు ఇంగ్లాండ్ తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మొదలైన మొదటి టెస్ట్ లో ఫాన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు.

ఒక రివ్యూ విషయంలో పంత్ కోహ్లీతో చేసిన డిస్కషన్ కూడా హైలెట్ అయింది. అయితే రిషబ్ పంత్ టెస్ట్ మొదటి రోజున ఫంకీ సన్ గ్లాసెస్ ధరించాడు. గతంలో ఇహే రకంగా ఉన్న గ్లాసెస్ ని చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న యువ ఆల్ రౌండర్ శాం కర్రన్ ధరించాడు. దీనితో ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కర్రన్‌తో పోల్చడం ప్రారంభించారు. మైదానంలో కాస్త ఫన్నీగా ఉండే సన్ గ్లాసెస్ ధరించడానికి కుర్రాన్ ఇష్టపడతాడు. దీనితో పంత్... కర్రన్ గ్లాసెస్ దొంగతనం చేసాడని ఫాన్స్ కామెంట్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: