ఇక ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో భారత్‌ వందేళ్ల కల నెరవేరింది. అథ్లెటిక్స్‌లో మొదటి సారి అది కూడా బంగారు పతకం వచ్చింది. టోక్యో లో జరిగిన ఈ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గొప్ప చరిత్ర సృష్టించాడు. ఏకంగా ఎవరికీ సాధ్యం కాని విధంగా గోల్డ్ మెడల్ గెలిచి.. యావత్ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తాడు నీరజ్. 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన ఇండియన్ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రోలో ప్రత్యర్థులెవరూ నీరజ్ చోప్రా దరిదాపుల్లోకి కూడా రాకపోవడం విశేషం. మొదట అవకాశంలోనే నీరజ్ 87.03 మీటర్ల దూరం ఈటెను విసిరి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ తర్వాత రెండో అవకాశంలో మరింత సూపర్ గా 87.58 మీటర్లు విసిరాడు. ఇక మూడో ప్రయత్నంలో మాత్రం 76.79 మీటర్లకు మాత్రమే నీరజ్ పరిమితం అయ్యడు. ఆ తర్వాత కూడా రెండుసార్లు ఫౌల్స్ పడ్డాయి.ఇక ఆరో రౌండ్‌లో నీరజ్ 84.24 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. మొత్తానికి నీరజ్ ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలెబ్రెటీలు నీరజ్ కి అభినందనలు తెలిపారు.సూపర్ స్టార్ మహేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి టాలీవుడ్ అగ్ర హీరోలు నీరజ్ కి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

https://twitter.com/urstrulyMahesh/status/1423990843786948611?s=19


 https://twitter.com/KChiruTweets/status/1423984320050470917?s=19



మరింత సమాచారం తెలుసుకోండి: