
ఇల్లు - కలలకు
ఇల్లు - ఆశయాలకు
ఇల్లు - నలుగురికీ
ఇల్లు - అందరికీ
అందరికీ కాదు అందరిదీ
ఇవాళ సైదాబాద్ కు పోయిండు కేటీఆర్.. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలన్న సంకల్పానికి తుది రూపు ఇది. ఆ సందర్భంగా ఓ లబ్ధిదారు కేటీఆర్ ను కదిలించింది. దీవెనలు ఇచ్చి గొప్ప జ్ఞాపకంగా మారిపోయింది. ఆ కథ ఇది చదువుండ్రి..
పేదల ఇళ్ల పంపిణీలో గొప్ప భాగ్యం అందుకున్నాడు కేటీఆర్..కలల కుటీరాలు పంచుతూ దీవెనలు అందుకున్నాడు కేటీఆర్. పేదలకు మంచి చేస్తే పొంగిపోతారు అని చెప్పేందుకు తార్కాణంగా నిలిచాడు కేటీఆర్.. ఇంటి పత్రం అందుకుంటూ దీవెనలు అందించి పోయిన ఆ మగువ కేటీఆర్ జీవితాన్నే ఇకపై మార్చనుంది. తప్పక రేపటి వేళ జరగబోయేది ఇది. వేదికపై అసరుద్దీన్ ఉన్నాడు. వేదికపై జీహెచ్ఎంసీ మేయర్ ఉన్నారు..సైదాబాద్ వాకిట 288 ఇళ్లు.. డబుల్ బెట్ రూమ్ ఇళ్లు.. 24.91 కోట్ల రూపా యల వెచ్చింపుతో ఈ అందమైన ఇళ్లకు ఆకారం దక్కింది.. రూపం గొప్పగా కుదిరింది. ఇళ్లంటే పేదలకు నిలువ నీడ కాదు గొప్ప ఆశయం. జీవితాశయం అని రాయాలి. ఓ ప్రభుత్వం తన సంకల్పంలో భాగంగా ప్రజల ఆశయాలు నెరవేర్చే క్రమంలో నిబద్ధతే ప్రామాణికం అనుకుంటే పేదలకు కొండంత భరోసా దక్కుతుంది. నిలువ నీడే కాదు జీవితానికో ఉపాధి మార్గం, జీవితాలకో ఆనందాల తోడు తప్పక దొరుకుతాయి. కేటీఆర్ ఆనందించాడు. మేయర్ అలా ఉండిపోయారు.. వావ్ రాజకీయ నాయకుల్లో ఇంకా ఇంకొందరు ఈ సన్నివేశాన్ని రీప్లే చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ దీవెనలే కానుక అంటున్నాడు కేటీఆర్. అంతేనా! ఓ చిన్నారి చేత ఓ ఇంటి ని ప్రారంభింపజేసి ఆ బుజ్జాయి కళ్లలో కొత్త కాంతులు నింపి వచ్చాడు. ఆ మైనార్టీ బాలికకు
అదొక అపురూప కానుక. ఇవన్నీ ఓవైసీ చూస్తున్నాడు.. తను కూడా ఈ ఆనందంలో భాగమే!