క‌రోనా వ్యాప్తి కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రువాత కేంద్ర‌ప్ర‌భుత్వం ఎల్‌పీజీ స‌బ్సీడీని తిరిగి ప్రారంభించే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాలు వెలువ‌డిన ఓ నివేధిక ప్ర‌కారం..దేశంలో వేగంగా పెరుగుతున్న ఎల్‌పీజీ ధ‌ర నియంత్ర‌ణ‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ నుంచి ఎల్‌పీజీ స‌బ్సీడిని పున‌రుద్ధ‌రించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. 20220 జులై నెల నుంచి కేంద్ర ప్ర‌భుత్వం స‌బ్సీడిని నిలిపివేసిన విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే.

సౌదీ అరామ్‌కో ప్రొఫెన్ ధ‌ర‌ను మెట్రిక్ ట‌న్నుకు 870 డాల‌ర్లు, బ్యూటెన్ మెట్రిక్ ట‌న్నుకు 830 డాల‌ర్ల చొప్పున అందించిన‌ది. అయితే దీని కార‌ణంగా దేశీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధ‌ర భారీగా పెరిగింది. ప్రొపెన్ ధ‌ర‌లు 800 నుంచి 870 డాలర్లు, బ్యూటెన్ 795 నుంచి 830 డాల‌ర్ల వ‌ర‌కు పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండ‌ర్ గ్యాస్ ప్రొపెన్, బ్యూటెన్ మిశ్ర‌మంతో నిండి ఉంటుంది. ఈ రెండు గ్యాస్‌ల ధ‌ర‌లు పెర‌గ‌డంతోనే ఎల్‌పీజీ సిలిండ‌ర్ల ధ‌ర‌లు పెరిగాయ‌ని వెల్ల‌డి అవుతుంది. అయితే డిసెంబ‌ర్ నుంచి మాత్రం కేంద్రం ఎల్‌పీజీ స‌బ్సీడిని పున‌రుద్ధ‌రించాల‌ని పూనుకున్న‌ట్టు తెలుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: