తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు ప్రారంభం అయ్యాయి. భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దల కేరింతలు కొడుతున్నారు. తెలుగు లోగిళ్లు బంధుమిత్రుల‌తో కళకళలాడుతున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలతో తెలుగు పల్లెలు సందడిగా మారాయి.
రంగు రంగుల ముగ్గులతో పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.


సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని.. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. సీఎం జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు. రైతులకు ముఖ్యమైన పండు సంక్రాంతి అన్న సీఎం.. ప్రజలంతా సంబరంగా సంక్రాంతి జరుపుకోవాలని కోరారు.


ఇక టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు.. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంక్రాంతి జరుపుకోవాలన్నారు. ఈ సంక్రాంతి ప్రతి తెలుగు లోగిలిలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సంక్రాంతి ప్రకృతితో అనుసంధానమైన రైతుల పండుగ అన్న చంద్రబాబు.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: