పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో ఓ వాలంటీర్‌ పెన్షన్ల సొమ్ము తీసుకుని లవర్‌తో లేచిపోయాడు. వృద్ధాప్య పింఛను లబ్ధిదారులకు డబ్బులు పంచకుండా ఆ డబ్బులు తీసుకుని ప్రియురాలితో చెక్కేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ లు పంపిణీ చేయవలసిన గ్రామ వాలంటీర్ మల్లవరపు రవిబాబు.. ఆ డబ్బులు పంచకుండా డబ్బులు తీసుకుని ప్రియురాలితో  పరారైనట్లు సమాచారం తెలుసుకున్న మూగ చింతలపాలెం సచివాలయ గ్రామ కార్యదర్శి  శ్రీనివాసరావు అధికారులకు సమాచారం అందించారు.  


వాలంటీర్ రవిబాబు తండ్రికి సమాచారం ఇచ్చినట్లు తెలియజేశారు. కుమారుడు తీసుకెళ్లిన డబ్బును సచివాలయ సిబ్బందికి తండ్రి చెల్లించాడు. వాలంటీర్ రవిబాబుకి గతంలో వివాహమై ఒక పాప , భార్య 9 నెలల గర్భవతి అని తెలిపారు. అయితే.. ఆలస్యమైనా తాము లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసినట్లు గ్రామ సచివాలయ సిబ్బంది తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాలంటీర్ రవిబాబు ను విధుల నుంచి తొలగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: